టాలీవుడ్: డిసెంబర్ చివరి వారం లో ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమా విడుదల చాలా సినిమాలు విడుదల చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలిచింది. కరోనా తర్వాత థియేటర్ లలో జనాల రిసీవింగ్ ఎలా ఉంటుందో అని సందేహపడిన నిర్మాతలకి ‘సోలో బ్రతుకు సో బెటర్’ కి వచ్చిన రెస్పాన్స్ చూసి తమ సినిమాలు నిర్భయంగా విడుదల చేసుకోవచ్చని ధైర్యం లభించింది. ఒకేసారి సంక్రాంతి కి మూడు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఒక డబ్ సినిమా విడుదల అవుతున్నాయి. ఇపుడు మిగతా సినిమాల మేకర్స్ కూడా వరుసగా సినిమాలు విడుదల ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’ జనవరి 23 న విడుదల అవుతుందని ప్రకటించారు. ‘అనిల్ సుంకర’ నిర్మాణం లో ‘గిరి పాలిక’ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సరైన టైం కోసం ఎదురుచూసి విడుదల ప్రకటించింది.
కరోనా ని, రాయలసీమ ఫ్యాక్షన్ ని, జాంబీ ఎలెమెంట్స్ ని కలిపి ‘జాంబీ రెడ్డి’ అనే సినిమా రూపొందిన విషయం తెల్సిందే. అ!, కల్కి లాంటి వైవిధ్యమైన సినిమాలని రూపొందించిన ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 5 న విడుదల అవబోతున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ లభించడం తో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.
పరిస్థితులు మెరుగుపడి థియేటర్లకు జనాలు వస్తుండడం తో ఇన్నిరోజులు ఎపుడు విడుదల చెయ్యాలో సందేహం లో ఉన్న సినిమా నిర్మాతలు అందరూ ఇపుడు ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇంకా ‘ఉప్పెన’, ‘A1 ఎక్ష్ప్రెస్స్’, ‘వకీల్ సాబ్’, ‘చెక్’,’కపటధారి‘, ‘చావు కబురు చల్లగా’, ‘కేజీఎఫ్’ సినిమాలు విడుదల తేదీలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు పూర్తి అయిన సినిమాలు పూర్తి అవ్వాల్సిన సినిమాల లిస్ట్ చూస్తే దాదాపు ఒక ఆరు నెలల వరకు సినిమా అభిమానులకి ప్రతీ వారం పండగే అని చెప్పుకోవచ్చు.