టాలీవుడ్: ఒక హీరో -హీరోయిన్ లేదా హీరో – డైరెక్టర్ కాంబినేషన్ లో ఒకటి లేదా రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఆ కాంబినేషన్ ని సూపర్ హిట్ కాంబినేషన్ అని వాళ్ళ కాంబినేషన్ లో వచ్చే తదుపరి సినిమాలకి అంచనాలు బిజినెస్ కూడా ఎక్కువ రేంజ్ లో ఉంటాయి. ఇపుడు ఉన్న జెనరేషన్ లో హీరోయిన్లతో రిపీట్ కాంబినేషన్ లు ఊహించలేం కానీ హీరో -డైరెక్టర్ కాంబినేషన్ లో మాత్రం రాబోయే సంవత్సరంలో మంచి సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఈ కాంబినేషన్ లో మొదటగా చెప్పుకోవాల్సింది బోయపాటి శ్రీనివాస్ – నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ సినిమాలన్నీ పోయి ఇండస్ట్రీ లో బాలకృష్ణ సినిమాలకి ఆదరణ తగ్గుతున్న సమయంలో సింహా అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చి మళ్ళీ బాలయ్య ని నిలబెట్టాడు బోయపాటి. ఆ తర్వాత మరి కొన్ని ప్లాప్ ల తర్వాత ‘లెజెండ్’ అనే సినిమాని తీసి అదే రేంజ్ సక్సెస్ అందించారు వీళ్లిద్దరు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా రూపుదిద్దుకుంటుంది. ‘అఖండ‘ అంటూ రూపుదిద్దుకుంటున్న వీళ్లిద్దరి సినిమాపై అంచనాలు, బిజినెస్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.
ఈ వరుసలో చెప్పుకోవాల్సిన మరో కాంబినేషన్ సుకుమార్ – అల్లు అర్జున్. వీళ్లిద్దరు ఇండస్ట్రీలో ఒకే సారి మొదటి హిట్ ‘ఆర్య’ అనే సినిమాతో కొట్టారు. ఆ సినిమాతో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో హీరో కారెక్టరైజెశన్ ఉంటుందని అలంటి హీరో కారెక్టర్ తో సినిమాని హిట్ చెయ్యొచ్చని నిరూపించాడు సుకుమార్. ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ‘ఆర్య -2 ‘ రూపొందించారు. ఈ సినిమా అంచనాలని అందుకోలేకపోయినా కూడా ఒక సెక్షన్ ప్రేక్షకులకి మాత్రం బాగా నచ్చింది. ఈ సినిమాని కూడా తీసిపాడేయ్యలేం. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా రూపొందింది. ఈ సినిమా మేకింగ్, కాస్టింగ్ అన్నీ తగు జాగ్రత్తలతో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ చేసే దిశగా ముందుకు వెళ్తుంది.
మరొక సైలెంట్ కాంబినేషన్ త్రివిక్రమ్ – మహేష్ బాబు. వీళ్ళ కాంబినేషన్ లో మొదట ‘అతడు’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సైలెంట్ హిట్ గా నిలబడింది. త్రివిక్రమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది కూడా ఈ సినిమానే. వీళ్ళ కాంబినేషన్ లో తర్వాత వచ్చిన సినిమా ‘ఖలేజా’. అంచనాలు ఎక్కువగా ఉండడం వలన, మహేష్ ని కొత్తగా ప్రెసెంట్ చేయడం వలన ఈ సినిమా థియేటర్లలో అంతగా వసూళ్లు రాబట్టలేదు. కానీ తర్వాత ఈ సినిమాని పొగడని వాళ్ళు లేరు. కలెక్షన్లు రాబట్టలేదు కానీ ఈ సినిమా సూపర్ హిట్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళ కాంబినేషన్ లో ప్రస్తుతం మరో సినిమా రూపుదిద్దుకోవడానికి రంగం సిద్ధం అయింది. 2022 సమ్మర్ లో వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా విడుదల అవనుంది.
ఈ సినిమాలు అన్నీ మంచి అంచనాలతోనే రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సంవత్సరం చివర్లో మరియు వచ్చే సంవత్సరం వేసవి వరకు ఈ సినిమాలు రాబోతున్నట్టు అంచనాలు ఉన్నాయి.
ఇవే కాకుండా మరి కొన్ని హిట్ కాంబినేషన్ సినిమాలు కూడా మరి కొద్దీ రోజుల్లో ప్రకటించనున్నారు.