మూవీడెస్క్:నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న NBK 109 సినిమా ప్రొడక్షన్ దశలో వేగంగా ముందుకు సాగుతోంది.
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొల్పుతోంది.
సినిమా షూటింగ్‌లో బాలయ్య ఎనర్జీకి మేనేజ్ చేయగలిగే దర్శకులు చాలా తక్కువమంది ఉంటారు. బాబీ మాత్రం ఈ పనిని కాస్త ఛాలెంజ్‌గా తీసుకుని జైపూర్‌లో సుదీర్ఘంగా ఒక యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరించారు.
తాజాగా ఈ షెడ్యూల్ పూర్తైందని బాబీ సోషల్ మీడియాలో ప్రకటించడమే కాకుండా, బాలకృష్ణతో దిగిన ఒక ఫోటోను కూడా షేర్ చేశారు.
జైపూర్ షెడ్యూల్ బాలయ్య ఎనర్జీతో సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యిందని, మోస్ట్ ఇంటెన్స్ సీక్వెన్స్‌లను పూర్తి చేయగలిగామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలాగే బాలకృష్ణ అద్భుతమైన ప్రదర్శనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక NBK 109 టైటిల్ టీజర్‌ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు బాబీ వెల్లడించారు.
అయితే, టీజర్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీర మాస్ అనే టైటిల్ చర్చల్లో ఉంది, కానీ ఇది నిజమా కాదా అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.