fbpx
Sunday, January 19, 2025
HomeMovie NewsSSMB29: రాజమౌళి కొత్త సినిమా విశేషాలు

SSMB29: రాజమౌళి కొత్త సినిమా విశేషాలు

UPDATES-ON-RAJAMOULI-SSMB29
UPDATES-ON-RAJAMOULI-SSMB29

మూవీడెస్క్: దర్శకధీరుడు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ SSMB29 కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనున్న విషయం తెలిసిందే.

‘SSMB29’ పేరిట నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి ఈ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.

మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా గెడ్డం, పొడవాటి జుట్టు లుక్కులో కనిపిస్తూ ఉన్నారు.

ఇదే లుక్ తో మహేష్ బాబును ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ లో యానిమల్స్ కు కీలక పాత్రలు ఉండగా, ఇక్కడ కూడా యానిమల్స్ కి మరింత ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

దీంతో ఈ మూవీపై అభిమానుల్లో క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇంతకుముందే రాజమౌళి ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని వెల్లడించారు.

వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో, అడవి జంతువులతో మహేష్ బాబుకి ఎలాంటి సన్నివేశాలు ఉంటాయా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అదే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా రాజమౌళి ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల కావడంతోనే, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular