మూవీడెస్క్: కన్నడ స్టార్ ఉపేంద్ర తన డైరెక్షన్‌లో రూపొందిన సినిమా UI తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యారు.
డిసెంబర్ 20న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ తో మంచి ఆసక్తిని రేపింది. ఉపేంద్ర తన విలక్షణ కథనంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయని, ప్రేక్షకులు కథని డీకోడ్ చేస్తూ థ్రిల్ అవుతారని ఉపేంద్ర స్వయంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు.
UI సినిమా కథనం పూర్తిగా విభిన్నంగా సాగుతుందని, దీన్ని అర్థం చేసుకోవడం ప్రేక్షకులకు ఒక ఛాలెంజ్‌గా ఉంటుందని ఉపేంద్ర చెప్పారు.
అయితే, ఎక్కువ శాతం ఆడియెన్స్ సినిమా చూస్తూ రిలాక్స్ అవ్వడం, వినోదాన్ని ఆస్వాదించడం కోసమే థియేటర్లకు వస్తారు.
అలాంటి పరిస్థితుల్లో గాఢత కలిగిన కథాంశాలు ప్రేక్షకులందరికి సమానంగా నచ్చే అవకాశం తక్కువ.
మాస్ ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే సినిమాలను ఎంచుకుంటారు.
అయితే, కంటెంట్ క్లిక్ అయితే ప్రయోగాత్మక కథలు కూడా విజయాన్ని సాధిస్తాయి. ఉపేంద్ర గత సినిమాలు గమనిస్తే, ఆయన వినూత్న కథలతో మంచి గుర్తింపును పొందారు.
కానీ ఈసారి UI సినిమా ఒకటిగా అందరిని ఆకట్టుకుంటుందా, లేదా కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాలి.
ఉపేంద్ర తమ ప్రయోగంతో మరో మైలురాయి సృష్టిస్తారనేది ఆయన ఫ్యాన్స్ ఆశ. కానీ కథనం క్లిష్టతతో ఉంటే, ప్రేక్షకుల సహనం పరీక్షించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
UI సినిమా ఎలా ఉండబోతుందనేది డిసెంబర్ 20న తెలుస్తుంది.