fbpx
Thursday, January 30, 2025
HomeBusinessయూపీఐ లావాదేవీలకు కొత్త మార్గదర్శకాలు

యూపీఐ లావాదేవీలకు కొత్త మార్గదర్శకాలు

upi-new-rules-from-february

యూపీఐ పేమెంట్స్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ మార్పుల ప్రకారం, ట్రాన్సాక్షన్ ఐడీలలో @, #, & వంటి ప్రత్యేక అక్షరాలు ఉంటే లావాదేవీలు ఫెయిల్ అవుతాయి. NPCI ప్రకారం, నకిలీ ట్రాన్సాక్షన్లను అరికట్టడం, భద్రతను పెంచడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.

ఇటీవల యూపీఐ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిసెంబర్ 2024లో 16.73 బిలియన్ లావాదేవీలు నమోదవగా, వాటి విలువ రూ.23.25 లక్షల కోట్లకు చేరుకుంది.

రోజువారీ లావాదేవీలు కూడా పెరుగుతుండటంతో NPCI కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ మార్పులను పాటించని యూపీఐ యాప్‌లు వినియోగదారులకు సేవలు అందించలేవు.

వినియోగదారులు తమ యాప్‌లు, ఐడీలను నవీకరించుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని NPCI స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular