fbpx
Saturday, March 22, 2025
HomeNationalఅలాంటి నెంబర్లకు UPI సేవలు నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం

అలాంటి నెంబర్లకు UPI సేవలు నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం

upi-services-inactive-mobile-numbers-npci-april-1

న్యూఢిల్లీ: క్రియాశీలంగా లేని ఫోన్ నెంబర్లపై కేంద్రం కీలకంగా స్పందించింది. ఏప్రిల్ 1నుంచి ఇనాక్టివ్ మొబైల్ నెంబర్లకు యూపీఏ (UPI) సేవలను నిలిపివేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ యాప్‌లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఇనాక్టివ్ నంబర్లను టెలికాం సంస్థలు మళ్లీ ఇతరులకు కేటాయిస్తుండటంతో, పాత యూపీఏ ఖాతాలు మోసపూరిత లావాదేవీలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని అడ్డుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు NPCI తెలిపింది. 

గూగుల్ Pay, ఫోన్ పే, Paytm వంటి యూపీఏ యాప్‌లు తమ యూజర్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

మీ మొబైల్ నంబర్ వాడుకలో లేకపోతే, UPI సేవలు నిలిపివేస్తామని నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత కూడా నంబర్ యాక్టివ్ చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. బ్యాంక్ లింక్‌డ్ నంబర్ మారినవారు, పాత నంబర్ సరిగా అప్డేట్ చేయని వారు ఈ నిర్ణయంతో ప్రభావితులవుతారు.

సేవలు నిలిపివేయబడకుండా ఉండాలంటే, బ్యాంక్ రికార్డుల్లో నంబర్ అప్డేట్ అయి ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ లేదా బ్రాంచ్ సందర్శన ద్వారా ఇదిని సరిచేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular