ముంబై: ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది.
తన ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటిసులు జారీ చేసింది.
కాగా పూజా యూపీఎస్సీ కి నకిలీ ఐడెంటిటీ సమర్పించి ఉద్యోగం సాదించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక పై పూజా యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా కూడా ఆంక్షలను విధించింది. అలాగే, అమెపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయమిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.