ఊర్వశికి గుడి కావాలట.. సౌత్‌లో ఆలయం కోరిక!
బాలీవుడ్ గ్లామర్ డాల్ ఊర్వశి రౌతేలా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో తన పేరుతో ఆలయం ఉందని, అదే తరహాలో దక్షిణ భారతదేశంలో కూడా తనకు గుడి కట్టాలని ఆకాంక్షించిందట.
“బద్రీనాథ్ టెంపుల్ పక్కనే నా పేరుతో ఆలయం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో నా ఫోటోకు పూలమాలలు వేసి, దండమామాయిగా పిలుస్తారు. ఆ వార్తలు చూసి నేనూ షాక్ అయ్యాను” అని ఊర్వశి తెలిపింది.
టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్‌లతో నటించిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, సౌత్‌లో తనకు గుడి కావాలని తెలుపుతూ నవ్వించింది.
యాంకర్ వేసిన ప్రశ్నకు ఆమె స్పందన వినడానికి ఇంకా ఆసక్తికరంగా మారింది. “గుడిలో ఏమేం జరుగుతాయో, నా ఆలయంలో కూడా అవే జరుగుతాయి” అని సమాధానం ఇచ్చింది. నెటిజన్లు మాత్రం ఈ కామెంట్లపై ఫన్నీగా స్పందిస్తూ, ఊర్వశి ఏదో భ్రమలో ఉందేమో అంటున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కొనసాగుతున్న ఊర్వశి.. ఈ వింత కోరికతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.