గత వారం విడుదలైన తెలుగు, తమిళ, హిందీ సినిమాలు నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు సాధించాయి. టిల్లు స్క్వేర్ సక్సెస్ తర్వాత వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’కు భారీ అంచనాలుండగా, ఫస్ట్ వీకెండ్ నుంచే ఫలితం నిరాశ కలిగించింది.
జాక్ అమెరికాలో ఇప్పటివరకు కేవలం $200,000 మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కు మిలియన్ డాలర్ అవసరం కావడంతో ఈ సినిమా భారీ నష్టాల్లో ఉందని ట్రేడ్ విశ్లేషణ. మరోవైపు, మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘జాట్’ కూడా ఓ మోస్తరు వసూళ్లతోనే నిలిచింది. ఇప్పటివరకు $300,000 వసూల్ చేసింది.
ఈ వీకెండ్ బాక్సాఫీస్ విన్నర్ మాత్రం అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మాస్ రీస్పాన్స్‌తో ఈ మూవీ మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. కథ, యాక్షన్ ఎలిమెంట్స్ యూఎస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా, యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ అమెరికాలో రిలీజ్ కాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మొత్తానికి ఈ వీకెండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ డామినేట్ చేసినట్లే.