వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఫలితాలు విడుదల అయ్యాయి. 578 ఎలక్టోరల్ వోట్లలో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు రాగా, జార్జియా జో బైడెన్ కైవసం అయ్యింది. నిన్న మొన్నటివరకు అధికార మార్పిడికి సహకరించని ట్రంప్ తుది ఫలితాల అనంతరం కాస్త వెనక్కి తగ్గినట్టున్నారు.
ఫలితాలపై కోర్టుకు వెళ్లే అంశంపై కూడా ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. దీంతో అధికార మార్పిడి దిశగా అమెరికాలో
పరిణామాలు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ విలియం బార్ ఓటింగ్ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం వంటివి చేశారు.
ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేక ట్రంప్ పెంటగన్ అధ్యక్షుడిని కూడా తప్పించారు. అయితే తాజా పరిణామాల అనంతరం ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. అయినా తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్ ఎన్నికల తరహా స్టాఫ్ ది స్టీల్, మిలియన్ మెగా మార్చ్, విమెన్ ఫర్ అమెరికా ఫస్ట్ అనే పేర్లతో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది.