క్లీవ్‌ల్యాండ్: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో అమెరికాకు “గందరగోళం” తగినంతగా ఉందని, ఇక ఆ గదరగోళం ముగిసిందని డెమొక్రాటిక్ అబ్యర్థి అయిన జో బిడెన్ సోమవారం ఒహియోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అన్నారు. “డొనాల్డ్ ట్రంప్ ఇక తన సంచులను సర్దుకుని ఇంటికి వెళ్ళే సమయం ఇది” అని బిడెన్ తన చివరి రోజు ఓటు అడిగే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు బెల్వెథర్ స్టేట్ ఓహియోలో ఒక కార్యక్రమంలో మద్దతుదారులతో అన్నారు.
“మనము గందరగోళ సమయాన్ని పూర్తిచేశాము! మనము ట్వీట్లు, కోపం, ద్వేషం, వైఫల్యం, బాధ్యతారాహిత్యంతో ఉండే కాలాన్ని పూర్తి చేశాము” అని బిడెన్ అన్నారు. తాను ఎన్నికైనట్లయితే కరోనావైరస్ మహమ్మారిని “నియంత్రణలో ఉంచుతామని” ప్రతిజ్ఞ చేశాడు.
అమెరికాలో ఇవాళ జరిగే అధ్యక్ష ఎన్నికలలో తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరియు జో బిడెన్ తమదైన శైలిలో ప్రచారాన్ని రక్తి కట్టించారు. ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.