పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” పై మరోసారి హైప్ పెరిగింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే, తాజాగా నిర్మాత రవి శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
నితిన్ తాజా చిత్రం “రాబిన్ హుడ్” ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న రవి శంకర్, పవన్ పై చేసిన కామెంట్స్‌తో అభిమానుల్లో ఊపు తీసుకొచ్చారు. “పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందు పాన్ ఇండియా సినిమాలే పనికిరావు,” అంటూ స్పష్టంగా చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో సినిమాపై అంచనాలు హై రేంజ్ లో పెరిగాయి.
పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని, వచ్చే ఏడాది ఎలాగైనా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాత స్టేట్‌మెంట్‌తో, సినిమాపై మళ్లీ క్రేజ్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ రాబోయే పొలిటికల్ షెడ్యూల్ మధ్యలో సినిమా కోసం సమయం కేటాయిస్తారని టీమ్ ఆశిస్తోంది.
మొత్తానికి “ఉస్తాద్ భగత్ సింగ్” పాన్ ఇండియా స్థాయిలో కాకపోయినా, పవన్ ఫాన్స్‌కి మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అవే ప్రాజెక్ట్. మాస్, స్టైల్ మిక్స్‌తో తెరకెక్కే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అని వేచి చూస్తున్నారు.