పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులు నెమ్మదిగా సాగుతున్నా, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ తర్వాత పవన్‌తో మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా తమిళ మూవీ థెరి రీమేక్ అని తెలిసినప్పటి నుంచి, ఫ్యాన్స్‌లో మిశ్రమ స్పందన ఉంది. అయితే, హరీష్ శంకర్ స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేశాడని, అసలు కథతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా తెరకెక్కుతుందని సమాచారం.
ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో హరీష్ శంకర్, పవన్ అభిమానులను ఉర్రూతలూగించే ఒక రియల్ పొలిటికల్ మూమెంట్‌ను సినిమాలో రీ-క్రియేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులో కూర్చున్న స్టిల్ ఇప్పటికి కూడా ఆల్ టైమ్ బెస్ట్ మూమెంట్. వెనుక వేలాదిగా అభిమానులు బైకులు, కార్లలో ఫాలో అవుతున్న వీడియో బాగా వైరల్ అయింది. ఇదే సీన్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా రీ-క్రియేట్ చేస్తున్నట్టు వెల్లడించాడు.
పవన్ రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది మధ్యలో లేదా 2026 ప్రారంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి, హరీష్ శంకర్ ఈ సినిమాను ఓ మాస్ ట్రీట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చూడాలి!