fbpx
Thursday, December 12, 2024
HomeBig Storyకొన్ని వారాల్లో వ్యాక్సిన్ సిద్ధం: నరేంద్ర మోడీ

కొన్ని వారాల్లో వ్యాక్సిన్ సిద్ధం: నరేంద్ర మోడీ

VACCINE-IN-NEXT-WEEKS-SAYS-PM

న్యూఢిల్లీ: భారత్ లో ఇంకొన్ని వారాల్లోనే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్నారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

కోవిడ్ తాజా‌ పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం చవక ధరలో సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే అన్ని దేశాలు భారత్‌ వైపే దృష్టి సారించాయని అన్నారు.

కాగా ఇప్పటికే టీకా యొక్క ధర, వాటి పంపిణీ గురించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల అధినేతలందరూ మీ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయండి. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’’ అని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా తాము రూపొందించిన వ్యాక్సిన్‌ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్‌ కంపెనీ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇందుకు టీకాను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్‌ వద్ద స్టోరేజ్‌ చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఈ అంశం గురించి ఇప్పటికే రాష్ట్రాలతో మాట్లాడిన ప్రధాని మోదీ, ఈ టీకాను భద్రపరిచేందుకు వీలుగా కోల్డ్‌స్టోరేజీల వివరాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిగా చేశారు.

అదే విధంగా వాక్సిన్‌ స్టాక్‌ గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా‌ రూపొందించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘‘ప్రస్తుతం సుమారు ఎనిమిది వాక్సిన్లు వివిధ ట్రయల్‌ దశల్లో ఉన్నాయి. భారత్‌లో క్లినికల్‌ పరీక్షలు పూర్తి చేసుకునే దిశగా మూడు కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి రానున్న కొన్ని వారాల్లోనే దేశంలో వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular