మూవీడెస్క్: మెగా ఫ్యామిలీ యువ హీరో వైష్ణవ్ తేజ్, తన కెరీర్‌లో మంచి హిట్స్ అందుకోలేకపోయినప్పటికీ, ఎల్లప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఉప్పెన తో ఊహించని విజయాన్ని అందుకున్న వైష్ణవ్, ఆ సినిమా తర్వాత తన లైనప్‌ను పెంచుకున్నా, కొండ పొలం, రంగురంగ వైభవంగా, ఆదికేశవ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలవలేదు.
ఇప్పుడు వైష్ణవ్ తేజ్, కొంత గ్యాప్ తీసుకొని డిఫరెంట్ కథలతో మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాడు.
లేటెస్ట్ గా అతను ఇద్దరు కంటెంట్ ఓరియెంటెడ్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మొదటగా, ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మతో వైష్ణవ్ ఒక సినిమా చేయబోతున్నాడు.
విరించి ఇటీవల జితేందర్ రెడ్డితో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ, వైష్ణవ్ కోసం కొత్త కథ సిద్ధం చేసినట్లు టాక్.
ఇక మరో ప్రాజెక్ట్ కోసం టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్యతో కూడా వైష్ణవ్ చేతులు కలిపాడు.
ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రశంసలు అందుకున్న కృష్ణ చైతన్య, వైష్ణవ్ కోసం ఓ ప్రయోగాత్మక కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.