fbpx
Monday, September 16, 2024
HomeTelanganaఎయిర్ కార్గో వినియోగానికి తెలంగాణ వజ్ర బస్సులు!

ఎయిర్ కార్గో వినియోగానికి తెలంగాణ వజ్ర బస్సులు!

VAJRA-BUSES-FOR-COVID-VACCINE-SUPPLY

హైదరాబాద్‌: ఎయిర్ కార్గొ మరియు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తరలింపునకు తెలంగాణ ఆర్టీసీ తమ మినీబస్సులు ‘వజ్ర’ను వాడడానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ ప్రయోగాలు మూడో దశలో ఉన్నందున, మరో రెండుమూడు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సి ఉన్నందున పెద్దమొత్తంలో వ్యాక్సిన్‌ రాష్ట్రంలోని నలుమూలల ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరగాలి. ఇందుకోసం ఆర్టీసీ వజ్ర బస్సులు ఏమేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. నిపుణులకు బస్సులను చూపి నివేదిక తీసుకోనుంది.

రెండురోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ జీఎంఆర్‌ ఎయిర్‌కార్గోతో ఒప్పందం చేసుకుంది. విమానాల ద్వారా వచ్చే సరుకును సంబంధిత గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని కార్గో బస్సులను వినియోగించటం దీని ముఖ్య ఉద్దేశం. ఎయిర్‌కార్గోలో మందులు, వ్యాక్సిన్‌ తరలింపునకు ఏసీ బస్సుల అవసరం ఉంది.

వజ్ర బస్సులన్నీ ఎయిర్‌ కండీషన్‌ సదుపాయంతో ఉన్నవే. దీంతో వాటిని వాడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మందుల సరఫరా సాధారణంగానే ఉన్నా, కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత భారీగా వాహనాల అవసరం ఉంటుంది. అంత డిమాండును తట్టుకునేలా బస్సులు సిద్ధం చేయగల సామర్థ్యం ఉందా అని ఎయిర్‌కార్గో ప్రశ్నించింది. సాధారణ మందులకు 15– 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. కానీ వ్యాక్సిన్‌కు 4 డిగ్రీలలోపే ఉండాలి. దీంతో నిపుణుల ఆధ్వర్యంలో వజ్ర బస్సుల ఫిట్‌నెస్, ఏసీ పనితీరును పరిశీలింప చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

వ్యాక్సిన్‌ విషయంలో ఈ బస్సుల ఏసీ సామర్ధ్యం సరిపోదని తేలితే.. ఇతర మందులు, పండ్ల సరఫరాకు వాడతారు. హైదరాబాద్‌లోని కాలనీల నుంచి వరంగల్, నిజామాబాద్, రామగుండం లాంటి పట్టణాలకు మినీ ఏసీ బస్సులను నడిపితే బాగుంటుందనే సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఆర్టీసీ దశలవారీగా వంద వజ్ర బస్సులను సమకూర్చుకుంది. కానీ జనాదరణ లేకపోవడంతో ఈ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular