మూవీడెస్క్: దేశంలో కరోనా కేసుల తగ్గడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్ల దారి పడుతున్నారు. కాగా ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న చిత్రాలు, ఇప్పుడు వరుసగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి.
తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలను పెరిగాయి. దానికి తోడు ఇటీవల కాలంలో పెద్ద సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాకపోవడంతో ‘వలిమై’పై భారీ హైప్ క్రియేట్ అయింది.
కథ:
వైజాగ్ కేంద్రంగా ‘సైతాన్ స్లేవ్స్’ పేరుతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు నరేన్(కార్తికేయ). ఆన్లైన్ వేదికగా జరిగే ఈ చట్ట విరుద్ద కార్యక్రమానికి నిరుద్యోగ యువతనే అధికంగా వీరు టార్గెట్‌గా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేసి, చైన్ స్నాచింగ్, హత్యలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తుంటాడు.
ఆధునిక టెక్నాలజీ సాయంతో పోలీసుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడతాడు. వైజాగ్‌లో రోజు రోజుకి బైక్ రేసర్ల దొంగతనాలు, హత్యలు పెరిగిపోవడంతో, వాటిని అరికట్టడానికి రంగంలోకి దిగుతాడు అసిస్టెంట్ కమిషనర్ అర్జున్(అజిత్). ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? నేరస్తులను పట్టుకునే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతని ఫ్యామిలీని టార్గెట్ చేసిన నరేన్‌కు అర్జున్ ఎలా బుద్ది చెప్పాడు? చివరకు ఆన్లైన్ వేదిక ‘సైతాన్ స్లేవ్స్’ని ఎలా మట్టుపెట్టాడు?అనేదే సినిమా కథ.
మూవీ టాక్: 2.5 స్టార్స్ తో యావరేజ్ టాక్ పొందింది.