అమరావతి: వల్లభనేని వంశీకి మరోసారి చుక్కెదురు – రిమాండ్ పొడిగింపు, పోలీసు కస్టడీ!
రిమాండ్ పొడిగించిన కోర్టు
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత వల్లభనేని వంశీ రిమాండ్ గడువు ఈరోజుతో ముగియడంతో పోలీసులు వర్చువల్‌గా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్‌ను పొడిగించాలని పోలీసులు అభ్యర్థించగా, కోర్టు ఆమోదం తెలిపింది.
విచారణ కోసం కస్టడీకి తరలింపు
ఈ కేసులో పటమట పోలీసులు వంశీని విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ సమయంలో వంశీని నాలుగు సార్లు ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది.
వైద్య పరీక్షల అనంతరం విచారణ ప్రారంభం
ప్రస్తుతం వల్లభనేని వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కస్టడీ విచారణ ప్రారంభమవుతుంది. విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని కోర్టు షరతులు విధించింది.