సౌత్ డైరెక్టర్ల బాలీవుడ్ ప్రయాణాలు మిశ్రమ ఫలితాలనిస్తుండగా, తాజాగా వంశీ పైడిపల్లి పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చేసింది. వారసుడు’ వంటి హిట్ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌ను కలిసి కథ చెప్పినట్లు సమాచారం. స్క్రిప్ట్ నేరేషన్ పూర్తయిందని, ఆమిర్ హ్యాపీగా స్పందించాడన్న టాక్ ఫిలింనగర్‌లో ఊపందుకుంటోంది.
ఇది నిజమైతే వంశీపైడిపల్లి కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయని వంశీకి, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్‌తో ప్రాజెక్ట్ దక్కడం గొప్ప విషయమే.
పైగా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనున్నారనే ప్రచారం ఉన్నది. అలా అయితే బడ్జెట్ పరంగా కూడా వెనుకడుగు ఉండదు.
అయితే ఇది వాస్తవమా? లేక మరో గాసిప్‌నా అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే ఆమిర్ సాధారణంగా ఒక్క ప్రాజెక్ట్ కోసం రెండు మూడు సంవత్సరాలు టైమ్ తీసుకునే వ్యక్తి. అలాంటి ఆయన ఓ కథ నరేషన్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అన్నది బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లోనూ డౌట్‌గా మారింది.