fbpx
Saturday, December 21, 2024
HomeMovie Newsవంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్?

వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్?

VAMSI-PAIDIPALLY-TO-ENTER-BOLLYWOOD-SOON
VAMSI-PAIDIPALLY-TO-ENTER-BOLLYWOOD-SOON

మూవీడెస్క్: టాలీవుడ్‌ లో కమర్షియల్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు.

ఇటీవల అట్లీ “జవాన్”తో, సందీప్ రెడ్డి వంగా “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌లో విజయం సాధించడంతో, వంశీ పైడిపల్లి కూడా ఈ కోవలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

లేటెస్ట్ టాక్ ప్రకారం, వంశీ పైడిపల్లి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వినిపిస్తోంది.

గతంలో మురుగదాస్‌తో కలిసి “గజినీ” వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న అమీర్, ఇప్పుడు మరో సౌత్ ఇండియన్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేషన్ గతంలో “మున్నా,” “మహర్షి,” “వారసుడు” వంటి సూపర్ హిట్లు అందించిన విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడితే, ఇది వంశీపైడిపల్లికి బాలీవుడ్‌లో మంచి అవకాశంగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular