- కువైట్ నుండి తిరుపతి విమానాశ్రయానికి 149 మంది
- స్పెషల్ బస్సు లో క్వారంటైన్ కేంద్రానికి తరలింపు
తిరుపతి: వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి వందే భారత్ మిషన్‌లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియా విమానంలో కువైట్ నుండి తిరుపతి విమానాశ్రయానికి 149 మంది వచ్చారు.
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వీరా బ్రహ్మం విలేకరులతో మాట్లాడుతూ కువైట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 150 మంది ప్రయాణికులతో తెల్లవారుజామున 1.50 గంటలకు తిరుపతి చేరుకుందని, అందులో ఒక ప్రయాణీకుడు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్జీఐ విమానాశ్రయంలో దిగరాన్నరు. ఈ విమానంలోని ప్రయాణీకులందరి ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలు పూర్తయిన తరువాత శుక్రవారం 149 మందికి జ్వరాల సర్వే నిర్వహించిన అధికారులు ప్రయాణీకులకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా సహాయపడ్డారు.
చిత్తూరుకు చెందిన ఏడుగురు, తమిళనాడుకు చెందిన ఒకరు, అనంతపూర్కు చెందిన ఇద్దరు మరియు కర్నూలుకు చెందిన ఒక ప్రయాణికుడిని ప్రత్యేక బస్సులో తిరుపతికి సమీపంలో ఉన్న క్వారంటైన్స కేంద్రానికి పంపారు. కడప జిల్లాకు చెందిన 116 మంది ప్రయాణికులను కడప లోని క్వారంటైన్స కేంద్రానికి పంపారు. అలాగే మిగతా 22 మంది లో తూర్పు గోదావరికి చెందిన ఆరుగురిని, పశ్చిమ గోదావరికి చెందిన ఐదుగురిని, కృష్ణ జిల్లాకి చెందిన ఒకరిని, నెల్లూరికి చెందిన ఆరుగురు ప్రయాణికులతో సహా విశాఖపట్నంకి చెందిన నలుగురిని ఆయా జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రానికి పంపారు.