fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsస్టాండ్ అప్ రాహుల్ : వర్ష ఫస్ట్ లుక్

స్టాండ్ అప్ రాహుల్ : వర్ష ఫస్ట్ లుక్

VarshaBollamma FirstLook FromStandupRahulMovie

టాలీవుడ్: వరుస పరాజయాల్లో ఉన్న రాజ్ తరుణ్ ప్రస్తుతం హీరో గా ‘స్టాండ్ అప్ రాహుల్’ అనే సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీ గా ‘వర్ష బొల్లమ్మ‘ నటిస్తుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక కొత్త ప్రొఫెషన్ లో కనిపిస్తున్నాడు. స్టాండ్ అప్ కమెడియన్స్ అనే కొత్త ప్రొఫెషన్ ఈ మధ్య బాగా ప్రచారం అవుతుండడం తో ఆ ప్రొఫెషన్ ఉండే పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా నుండి హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. 96 , జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఈ సినిమాలో ఒక కొత్త లుక్ లో మెరిసింది.

కళ్లద్దాలు పెట్టుకుని, పల్లకి క్లిప్ పెట్టుకుని, కొత్త హెయిర్ స్టైల్ తో , డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఒక వెరైటీ లుక్ లో కనిపించింది. మరి ఈ లుక్ వెనక గల కారణాలేంటి అని సినిమా చూస్తే తెలుస్తుంది. బ్యాక్ డ్రాప్ లో పాత కాలం పాటల కాసెట్స్ మరియు బుక్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘శ్రేయ రావు’ అనే పాత్రలో ఈ సినిమాలో వర్ష ఒక కొత్త రకమైన పాత్రలో నటించనున్నట్టు అర్ధం అవుతుంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు కుమార్ అబ్బినేని మరియు భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్వీకర్ అగస్తి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శాంటో మోహన్ వీరంకి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular