టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ముందుగా ‘లక్ష్య’ అనే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా మరియు ‘వరుడు కావలెను’ అనే ఫామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మధ్యనే ‘లక్ష్య’ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలు పెట్టిన శౌర్య మరో సినిమా ‘వరుడు కావలెను’ సినిమా షూట్ ని పూర్తి చేసాడు. ఈ సినిమాని లక్ష్మి సౌజన్య అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదల చేసిన ఒక ఫోక్ సాంగ్ కూడా పరవాలేదనిపించింది.
ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. శౌర్య నటించిన ‘కల్యాణ వైభోగమే’ లాంటి ఒక క్లీన్ లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ తరహా లో ఈ సినిమా రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు పూర్తి చేసినట్టు సినిమా టీం ప్రకటించింది. సినిమాని అతి త్వరలో థియేటర్ లలో విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై PDV ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతంలో రూపొందుతున్న ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో విడుదల అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.