మూవీడెస్క్: హారర్ సినిమా లు ప్రేక్షకులను థ్రిల్లింగ్ అనుభూతులతో అలరిస్తూనే, విభిన్న కథాంశాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు హారర్ కామెడీ (HORROR COMEDY MOVIE) జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యాడు.
మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
“వీటీ 15” అనే పేరు పెట్టిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
మంటల మధ్యలో కోరియన్ ఫైర్ డ్రాగన్ జార్ కనిపించడం, ఇది ఇండో-కోరియన్ నేపథ్యంతో రూపొందిన హారర్ కామెడీ అని టీజర్ హింట్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది.
“వెన్ హాంటింగ్ టర్న్స్ హిలేరియస్!” ట్యాగ్‌లైన్‌తో హారర్ మరియు కామెడీని సమపాళ్లలో సమకూర్చిన ఈ చిత్రం, వరుణ్ తేజ్‌కి పూర్తిగా కొత్త తరహా ప్రయోగంగా నిలవనుంది.
ఇప్పటికే తొలిప్రేమ వంటి ప్రేమ కథలో మెప్పించిన వరుణ్, ఈసారి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, మార్చి నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.
నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది.
కొత్త జానర్‌లో వరుణ్ తేజ్ (VARUN TEJ) ప్రయోగం ప్రేక్షకులపై ఎంతమేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
VARUN TEJ NEXT MOVIE IS A HORROR COMEDY MOVIE WITH MERLAPAKA GANDHI