మూవీడెస్క్:వరుణ్ తేజ్ తన కెరీర్‌లో మరో విభిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ కథ 1980లలో ఉంటుందట. వైజాగ్ లొకేషన్స్‌ను పునఃసృష్టిస్తూ రూపొందిస్తున్నారు.
మట్కా సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుండటం విశేషం. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఆయన పాత్ర పేరు వాసు అని తెలుస్తోంది. కాకినాడలోని షూటింగ్ పూర్తయిన తర్వాత, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇక లొకేషన్ లో విశేషంగా, వరుణ్ మెడలో ఎర్ర కండువాతో ఉన్న కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కొత్త లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సెట్స్ పై రీక్రియేట్ చేసిన వైజాగ్ లొకేషన్లు, సినిమాలో కీలక సన్నివేశాలు అద్బుతంగా వచ్చినట్లు టాక్.
అలాగే, వరుణ్ తేజ్ ఈ సినిమాలో నాలుగు విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.