fbpx
Tuesday, October 22, 2024
HomeMovie Newsవరుణ్ తేజ్‌ కి ‘మట్కా’తో మళ్లీ హిట్ కొట్టే సమయం

వరుణ్ తేజ్‌ కి ‘మట్కా’తో మళ్లీ హిట్ కొట్టే సమయం

VARUN-TEJ-EXPECTING-HIT-FROM-MATKA-MOVIE
VARUN-TEJ-EXPECTING-HIT-FROM-MATKA-MOVIE

మూవీడెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ నవంబర్ 14న తన కొత్త సినిమా ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కరుణ కుమార్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

రజిని తాళ్లూరి, విజయ్ కుమార్ తీగల సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

వైజాగ్ నేపథ్యంలో మాఫియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే వచ్చిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

అయితే, రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. వరుణ్ తేజ్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో ఆయన మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. సాధారణ వ్యక్తిగా మొదలుకుని ‘మట్కా’ కింగ్‌గా ఎదిగిన కథను చూపిస్తారని తెలుస్తోంది.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.

ఇటీవల వరుణ్ తేజ్‌ సినిమాలు ‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ కమర్షియల్‌గా విఫలమయ్యాయి.

ఈ సినిమాల వల్ల ఆయన మార్కెట్‌లో డ్రాప్ వచ్చింది. అందుకే ‘మట్కా’ సక్సెస్ ఆయనకు చాలా అవసరం.

ఈ సినిమా విజయంతో తిరిగి తన మార్కెట్ స్ట్రాంగ్‌గా నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.

తమిళనాట ‘కంగువా’ మూవీ కూడా అదే రోజున రిలీజ్ అవుతుండడంతో ‘మట్కా’కి పోటీ పటిష్టంగా మారింది.

అందుకే వరుణ్ తేజ్‌ ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ సాధించి తన క్రేజ్‌ను నిలబెట్టుకోవాలి.

‘మట్కా’ కథ, ప్రదర్శనతో బాక్సాఫీస్‌లో నిలబడతాడా లేదా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular