బాలీవుడ్: 1995 లో గోవిందా, కరిష్మా కపూర్ కాంబినేషన్ లో రూపొంది హిట్ గా నిలిచిన సినిమా ‘కూలి నం:1 ‘. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ యంగ్ హీరో ‘వరుణ్ ధావన్‘ రీ మేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ కి జోడీ గా సారా అలీ ఖాన్ నటించింది. సినిమా ట్రైలర్ ఆరంభం లో దేశం లో అతి పెద్ద ధనవంతుడి లాగా వరుణ్ ని చూపిస్తారు. కానీ కోటీశ్వరుడైన పరేష్ రావల్ ని మోసం చేయడానికి వరుణ్ ఆడిన నాటకం అని తర్వాత తెలుస్తుంది. సినిమా ట్రైలర్ ఆద్యంతం వినోదం తో ఆకట్టుకుంది. లాజిక్స్ పక్కన పెడితే కామెడీ పరంగా మాత్రం వరుణ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సాంగ్స్, డాన్స్, రొమాన్స్, ఫైట్స్ అన్నిట్లో వరుణ్ ఆకట్టుకున్నాడు.
ట్రైలర్ లో చూపించిన చాల సీన్స్ ఇదివరకే ఎక్కడో చూసినట్టు అనిపించడం, ట్విన్స్ అని నాటకం ఆడడం లాంటి సీన్స్ చాలా రిపిటీటివ్ అని అనిపించాయి. ట్రైలర్ లోనే ఆలా అనిపిస్తే సినిమా లో ఇంకా ఎన్ని ఉంటాయో అనేది చూడాలి. రీ-మేక్ అని చెప్పినంత మాత్రాన అన్ని సీన్స్ అక్కడి నుండి తియ్యడం కాకుండా ఈ జెనెరేషన్ కి తగ్గట్టు ఇంకా మంచి ప్రయత్నం చేసుంటే బాగుండేది. కేవలం కామెడీ కోసమే ఈ సినిమా తీశారు అన్నట్టు అనిపిస్తుంది. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతని 45 వ చిత్రం. చాలా రోజుల తర్వాత జానీ లివర్, జావేద్ జాఫరీ, రాజ్పాల్ యాదవ్ ఈ సినిమాలో కనిపించారు. డిసెంబర్ 25 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ సినిమా విడుదల అవనుంది.