fbpx
Thursday, April 10, 2025
HomeMovie Newsవరుణ్ సందేష్ 'ఇందువదన' టీజర్

వరుణ్ సందేష్ ‘ఇందువదన’ టీజర్

VarunSandesh Indhuvadana Teaser

టాలీవుడ్: శేఖర్ కమ్ముల స్కూల్ నుండి వచ్చి హ్యాపీ డేస్ ద్వారా పరిచయం అయిన నటుడు వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ లాంటి హిట్ సినిమాల్లో కెరీర్ ఆరంభం లోనే నటించాడు. ఆ తర్వాత వరుసగా లవ్ స్టోరీలు చేసుకుంటూ పోయాడు. ఒక స్టేజ్ లో దాదాపు వరుసగా పది పైన ప్లాప్ లతో ఉన్నాడు. అవకాశాలు కూడా తగ్గాయి. తెలుగు బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న వరుణ్ సందేశ్ దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఒక సినిమా తో రానున్నాడు. ‘ఇందువదన’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది.

టీజర్ లో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించదు. ఫారెస్ట్ లో ఉండే ట్రైబల్ అమ్మాయిని వరుణ్ ప్రేమిస్తాడు. వీళ్ళ లవ్, రొమాన్స్ తో టీజర్ ప్రారంభించారు. స్మూత్ గా సాగుతున్న వీళ్ళ ప్రేమ లో అనుకోని అడ్డంకులు వచ్చి వరుణ్ సందేశ్ ని హత మారుస్తారు. తర్వాత టీజర్ చివర్లో హీరోయిన్ ని ఘోస్ట్ రోల్ లో చూపించారు. మరి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుందో చూడాలి. లవ్ స్టోరీ అనుకున్న సినిమా కాస్త రివెంజ్ సినిమాగా ఉండబోతుందా అనేది చూడాల్సి ఉంది. చివర్లో పార్వతీశం పాత్రలో కామెడీ కూడా చూపించారు.

ఫర్నాజ్ శెట్టి అనే కొత్త అమ్మాయి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. పీరియాడిక్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాని MSR డైరెక్ట్ చేసారు. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టడంతో ఈ సినిమాని అతి త్వరలో విడుదల చేసే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది.

Induvadana Teaser || Varun Sandesh || Farnaz Shetty || Sri Balaji Pictures || MSR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular