టాలీవుడ్: మెగా హీరోల్లో వరుణ్ తేజ్ నుండి వచ్చే సినిమాలు కొంచెం స్పెషల్ గా ఉంటాయి. మాస్, యాక్షన్ సినిమాలు కాకుండా కథ, కథనం లో కొత్తదనం కోరుకునే ప్రయత్నం చేస్తాడు వరుణ్. ఇండస్ట్రీ కి పరిచయం అయిన ముకుంద సినిమా దగ్గరి నుండి ఇదే పంథా ని ఫాలో అవుతున్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం తన పదవ సినిమాగా ఒక బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథతో రానున్నాడు. మెగా హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ అనే సినిమాతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసి సూపర్ సక్సెస్ సాధించాడు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మరో మెగా హీరో బాక్సింగ్ ఆటని తన సినిమాలో టచ్ చేస్తున్నాడు.
కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక పూర్తి లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. థమన్ సంగీతం లో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ ని ఇవాళ ప్రకటించారు. ఈ మధ్యనే సంక్రాంతి కి విడుదల అవబోయే సినిమాలు ప్రకటించి వచ్చే సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మూడు రోజుల వ్యవధి లో మూడు పెద్ద సినిమాల విడుదలని ప్రకటించారు. క్రిస్మస్ కి అల్లు అర్జున్ పుష్ప తో రానున్నాడు. అందరూ విడుదల తేదీ ని ప్రకటిస్తుండడం తో వరుణ్ తేజ్ కూడా ‘గని’ విడుదల తేదీ ని దీపావళి కి ప్రకటించాడు. కానీ దీపావళి కి రజినీకాంత్ ‘అన్నాథే’ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. చివరి షెడ్యూల్ లో ఉన్న ‘గని’ సినిమా మరి కొద్దీ రోజుల్లో షూటింగ్ ముగించుకోని విడుదలకి సిద్ధం అవనుంది.