fbpx
Monday, May 12, 2025
HomeMovie Newsదర్శకుడిగా మారిన సలార్ మ్యూజిక్ డైరెక్టర్ 

దర్శకుడిగా మారిన సలార్ మ్యూజిక్ డైరెక్టర్ 

veerachandrahassa-telugu-release-ravi-basrur-director

సలార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తారు. యక్షగానం నేపథ్యంతో తెరకెక్కించిన వీరచంద్రహాస అనే చిత్రంతో దర్శకుడిగా మారిన రవి, అదే సినిమాకు సంగీతాన్ని కూడా అందించారు. ఈ మూవీ ఇప్పటికే కన్నడ రాష్ట్రంలో మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.

శివరాజ్ కుమార్ క్యామియో రోల్‌తో ఈ సినిమాకు మరింత బలం చేకూరింది. కథలో మహాభారతంలోని అశ్వమేధిక పర్వాన్ని ఆధారంగా తీసుకుని డెప్త్ ఉన్న కథను రవి బస్రూర్ రూపొందించారు. మంచి మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు స్టేజ్ డ్రామా వలె ఆకట్టుకునే నాటకీయత ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 25న వీరచంద్రహాస తెలుగు వెర్షన్ విడుదల కానుంది. కన్నడ నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

రవి బస్రూర్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్లకు కొత్త మార్గం తెరచినట్లే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలయరాజా, కీరవాణి, తమన్ లాంటి సంగీత మేధావులు కూడా డైరెక్షన్ వైపు అడుగులు వేయని ఈ పరిస్థితుల్లో, రవి ప్రయత్నం నిజంగా ప్రత్యేకమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular