పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. క్రిష్ నుండి జ్యోతి కృష్ణ వరకు మారిన డైరెక్షన్ బాధ్యతల మధ్యా, ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే పవన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దర్శకుడు జ్యోతి కృష్ణ పవన్ మరో టాలెంట్‌ను బయటపెట్టారు. సినిమా కోసం ఉన్న ఆరు యాక్షన్ సీన్‌లలో ఒకదానిని పవన్ డిజైన్ చేశారని తెలిపారు.
ఆ సీన్ 20 నిమిషాల పాటు సాగుతుందట. 61 రోజుల పాటు 1100 మందితో షూట్ చేసిన ఆ సీన్ సినిమా హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.
ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్‌తో కలిసి పవన్ స్వయంగా గ్రౌండ్ వర్క్ చేశారట. ఈ స్థాయి డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్ కేవలం నటుడిగానే కాదు, యాక్షన్ క్రియేటివ్‌లోనూ దిట్ట అన్న మళ్లీ నిరూపితమైంది.
ప్రస్తుతం మే 9 రిలీజ్ డేట్‌కు మేకర్స్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రమోషన్ స్టార్ట్ కాకపోవడంతో విడుదలపై క్లారిటీ లేదని టాక్. అయినా మేకర్స్ పూర్తిగా ఫినిషింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఫ్యాన్స్ మాత్రం… పవన్ చేతుల మీదుగా వచ్చిన యాక్షన్ సీన్ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.