మూవీడెస్క్:టాలీవుడ్లో సంక్రాంతి పండగ ఎప్పుడూ స్టార్స్ మధ్య ఆసక్తికర పోటీతో అలరిస్తుంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఈ పండగ బరిలో నిలుస్తోంది.
ఈసారి కూడా అదే స్థాయిలో హడావుడి కనిపిస్తోంది.
ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతుండగా, వెంకటేష్ తాజా కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ, “సంక్రాంతి అంటే కుటుంబాలతో కలిసి ఆస్వాదించే సినిమాలు కావాలి.
మా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి పక్కా ఎంటర్టైనర్.
మిగతా పెద్ద చిత్రాలు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్,’ బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’ కూడా విడుదల అవుతుండటంతో, ప్రతి సినిమా విజయవంతం కావడం అవసరం.
సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే అన్ని చిత్రాలు హిట్ కావాలి,” అని వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
వెంకటేష్ తన పాత్ర గురించి చెబుతూ, ఈ సినిమా నా కెరీర్లో ప్రత్యేకమైనది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉన్నాయి.
ప్రేక్షకులకు మంచి పండగ ట్రీట్ అవుతుంది, అన్నారు.
ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సంక్రాంతి బరిలో ఈ మాస్ ఎంటర్టైనర్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.