‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా ఇప్పుడు తన మూడో సినిమాతో వస్తున్నారు. ఈసారి మాత్రం ఎమోషనల్ డ్రామా కాదు, పూర్తిగా రిస్కీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘రావు బహదూర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
బ్రిటీష్ కాలం నాటి పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ కోసం సత్యదేవ్ విభిన్నమైన లుక్‌కి రెడీ అవుతున్నాడని టాక్. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయిందని, కానీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వకుండా సైలెంట్‌గా షూట్ పూర్తిచేసేందుకు చూస్తున్నారని సమాచారం.
ఈ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టడం గమనార్హం. సత్యదేవ్ కెరీర్‌లో ఇది హై బడ్జెట్ మూవీగా నిలవనుంది. కథ మీద మేకర్స్‌కు భారీ నమ్మకం ఉన్నట్టు తెలుస్తోంది. ‘జీబ్రా’ తర్వాత ఇది ఆయనకు మరో టర్నింగ్ పాయింట్ కావచ్చని అంచనా.
వెంకటేష్ మహా గతంలో కమర్షియల్ సినిమాలపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనే మాస్ టచ్ ఉన్న సినిమా ట్రై చేయడం ఆసక్తికరం. కథ, టెక్నికల్ స్టాండ్‌ర్డ్‌కి పెద్ద పీట వేసిన ఈ చిత్రానికి రిస్క్ ఎక్కువైనా.. విజయం సాధిస్తే డబుల్ రివార్డ్ దక్కనుంది.
ప్రస్తుతం ప్రమోషన్ ఆలస్యం చేస్తున్నా, ఒకసారి షూటింగ్ పూర్తయిన తర్వాత భారీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.