fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsసెన్సార్ పూర్తిచేసుకున్న 'నారప్ప'

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘నారప్ప’

Venkatesh Narappa CensorCompleted

టాలీవుడ్: ధనూష్ హీరో గా వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ్ లో రూపొంది సూపర్ హిట్ అయిన సినిమా ‘అసురన్’. ఈ సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరో గా రీమేక్ చేస్తున్నారు. ఎపుడో షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదలకు వేచి చూడాల్సి వచ్చింది. ఫామిలీ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. మొదట ఎలా తీస్తాడో అనుకున్నారు కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా శ్రీకాంత్ బాగా హ్యాండిల్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఔట్పుట్ చూసి ధనుష్ నటించిన మరో సూపర్ హిట్ ‘కర్ణన్’ సినిమా రీమేక్ కూడా శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా ఈ రోజే సెన్సార్ పూర్తి చేసుకుంది. U /A సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా పోస్టర్ విడుదల చేసి కమింగ్ సూన్ అని ప్రకటించింది ఈ సినిమా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. ఈ సినిమా ఓటీటీ లో విడుదలవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తారా లేక థియేటర్లు మొదలయ్యే సూచనలు ఉండడం తో థియేటర్లు మొదలవ్వగానే ఫస్ట్ రిలీజ్ చేస్తారా అనేది సరైన ప్రకటన ఐతే ఏమీ లేదు. ప్రస్తుతం ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు అనే దాని పైన ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ ఒక ఏజ్డ్ ఫాదర్ పాత్రలో మరొక యంగ్ పాత్రలో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular