సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్, ఆ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా ఉంటుందంటూ ఊహాగానాలు ఉన్నా, ప్రస్తుతం అల్లు అర్జున్‌తో బన్నీ 22 మూవీకి బిజీగా ఉన్న త్రివిక్రమ్.. వేరే ప్రాజెక్ట్‌కి టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు టాక్.
ఇదిలా ఉండగా, రచయిత నందు చెప్పిన ఓ కథ వెంకటేష్‌కి నచ్చినట్టు తెలుస్తోంది. కానీ దానికి సరిపోయే డైరెక్టర్‌ను ఫిక్స్ చేయలేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడినట్టు ఫిలింనగర్‌లో చర్చ. ఇదిలా ఉండగానే, చిరంజీవి – అనిల్ రావిపూడి మూవీకి వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారన్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
రానా నాయుడు 2 వెబ్ సిరీస్ పనులు చివరిదశలో ఉండగా, డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈసారి మొదటి సీజన్‌పై వచ్చిన బూతు విమర్శలను దృష్టిలో పెట్టుకుని చాలా తగ్గింపులు చేసినట్టు సమాచారం.
వెంకటేష్ ప్రస్తుతం కథల ఎంపికలో ఎలాంటి తొందరగా డిసిషన్ తీసుకోకుండానే ఫుల్ కేర్‌తో ముందుకెళ్తున్నారు. విజయాన్ని నిలబెట్టుకునే కథ కోసం ఆయన మరింత టైం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Venkatesh, Trivikram Srinivas, Rana Naidu 2, Anil Ravipudi, Telugu Cinema,