మూవీడెస్క్: విక్టరీ వెంకటేష్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం సింగర్‌గా మారి మాస్ పాట పాడిన వెంకటేష్, ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రెండు సూపర్ హిట్ పాటలతో మంచి క్రేజ్ అందుకుంది.
ఇప్పటికే విడుదలైన “గోదారి గట్టు” , “మీను” పాటలు సంగీత ప్రియుల మనసు గెలుచుకున్నాయి.
తాజాగా వెంకటేష్ తన గొంతుతో మూడవ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 20 నిమిషాల్లోనే ఆయన ఈ పాటను పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు మనసుకు హత్తుకునే ట్యూన్ అందించగా, వెంకటేష్ వాయిస్ కొత్త ఊపును తీసుకువచ్చిందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని, ముఖ్యంగా సంక్రాంతి వాతావరణానికి అనుగుణంగా రూపొందించబడిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
వెంకటేష్ గతంలో గురు సినిమా కోసం పాట పాడి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమా పాటతో ఆయన మరోసారి అందరిని మెప్పించనున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్‌గా కనిపించనుండగా, ఐశ్వర్య లక్ష్మీ ఆయన భార్యగా నటిస్తున్నారు.
మీనాక్షి చౌదరి మరో కీలక పాత్రలో అలరించనున్నారు.
కామెడీ, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పక్కా ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.