మూవీడెస్క్: సంక్రాంతి పండగ తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి కాలం అని చెప్పవచ్చు.
ఈ సీజన్‌లో విడుదలైన సినిమాలు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్థ్యం కలిగినవే.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది.
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విజయనగరం ప్రాంతంలో మొదటి వారంలోనే రూ. 2,21,36,978/- గ్రాస్ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సినిమా విజయనగరంలో టాప్ 10 వసూళ్ల జాబితాలో మొదటి స్థానాన్ని అందుకుంది.
రాజమౌళి “ఆర్ఆర్ఆర్” ఈ ప్రాంతంలో రూ. 2,17,52,122/- తో రెండో స్థానంలో ఉంది.
అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” మూడో స్థానంలో నిలవడం విశేషం.
కాగా, పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన “కల్కి 2898 AD,” “బాహుబలి 2” చిత్రాలు ఈ జాబితాలో ఉన్నప్పటికీ, “సంక్రాంతికి వస్తున్నాం” దేనికీ తగ్గకుండా రాణించింది.
వెంకటేశ్ నటన, అనిల్ రావిపూడి వినోదాత్మక తెరకెక్కింపు, కుటుంబ భావోద్వేగాల కలయిక ఈ సినిమాకు అదనపు బలం అయ్యాయి.
విజయనగరం ప్రాంతంలో సంక్రాంతి పండగను పూర్తిగా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం, పండగ సీజన్‌కి ప్రేక్షకుల అంచనాలకు సరిపోయేలా నిలిచింది.
రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ, రూ. 1,02,37,696/- వసూళ్లతో పదో స్థానంలో ఉంది.
“సంక్రాంతికి వస్తున్నాం” సినిమా చేసిన ఈ రికార్డులు వెంకటేశ్ ఫ్యాన్స్‌కు ఉత్సాహం కలిగించాయి.