టాలీవుడ్: కొన్ని సంవత్సరాల క్రితం మలయాళం లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాని తెలుగు లో రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించాడు విక్టరీ వెంకటేష్. దృశ్యం మొదటి భాగం అన్ని భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి కొనసాగింపుగా రెండవ భాగం మలయాళం లో ఈ సంవత్సరం ఫిబ్రవరి లో ఓటీటీ లో విడుదలైంది. ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో విడుదలైన రెండవ రోజే విక్టరీ వెంకటేష్ దీన్ని రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ప్రకటించడమే కాకుండా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు.
ఈ సినిమా తొందరగా చేసి విడుదల చెయ్యకపోతే ఓటీటీ లో చాలా మంది చూసేస్తారు అని వేరే సినిమా కి కేటాయించిన డేట్స్ కూడా అడ్జస్ట్ చేసి ఈ సినిమా పనుల్లో నిమగ్నమయ్యాడు వెంకీ. సినిమా కోసం వేరే సెట్స్ వేయకుండా మలయాళం సినిమా రూపొందించిన ప్రదేశాల్లోనే ఈ సినిమా కూడా షూట్ చేసారు. ఈ సినిమా కోసం షూటింగ్ మధ్యలో ఉన్న F3 సినిమా కూడా పక్కన పెట్టి మార్చ్ లో మొదలుపెట్టి దాదాపు నెల రోజుల్లో ఈ సినిమాలో వెంకీ షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. తెలుగులో దృశ్యం మొదటి పార్ట్ లో ఉన్న నటులు అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. దాదాపు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో విడుదల అవనుంది.