టాలీవుడ్: కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో తనో ప్రత్యేక దర్శకుడు అని నిరూపించుకున్నాడు వెంకటేష్ మహా. తీసిన రెండు సినిమాలకి మంచి ప్రశంసలు పొందాడు. మొదటి సినిమా కేరాఫ్ కంచరపాలెం సినిమా అంచనాలు లేకుండా విడుదలై అందరి ప్రశంసలు పొంది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కరోనా మొదటి లాక్ డౌన్ లో ఓటీటీ లో విడుదలయ్యి మరో హిట్ గా నిలిచింది. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ వెంకటేష్ మహా కి డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం వెంకటేష్ మహా రెండు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాడు. తన మొదటి రెండు సినిమాలని నిర్మించిన పరుచూరి ప్రవీణ నిర్మాణంలో అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తో పాటు సీనియర్ నటుడు రాజశేఖర్ తో ‘మర్మాణువు’ మరో కొత్త రకమైన సినిమాని చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే ఈ రోజు మహా ఒక ఆడిషన్ కోసం పిలుపునిచ్చాడు. తాను తర్వాత చేయబోయే సినిమా కోసం ఒక ట్రాన్స్ జెండర్ పాత్ర కోసం వెతుకుతున్నానని , తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాత్ర అని, ఈ పాత్ర కోసం 23 – 29 ఏళ్ళ ట్రాన్స్ జెండర్ వ్యక్తి కావాలని, ధైర్యంగా ఎవరినైనా ప్రశ్నించగల కాన్ఫిడెంట్ గా ఉండే పాత్ర చేయడానికి ఆడిషన్ చేయబోతున్నట్టు వివరాలు పోస్టర్ లో ఉన్న ఈమెయిల్ కి పంపవచ్చునని తెలియ చేసారు.