
టాలీవుడ్: 2019 లో సంక్రాతి కి విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా F2 . విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి ముల్టీస్టారర్ గా చేసిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడున్న డైరెక్టర్ లలో కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘F3 ‘ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. F2 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ భార్యలతో వచ్చే ఎంటర్టైన్మెంట్ లాగా చూపించారు. ఈ సారి డబ్బులతో వచ్చే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చూపించబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
ఇప్పటివరకు ఈ సినిమా తీస్తున్నారు అని వార్తలే కానీ అధికారిక ప్రకటన ఐతే ఏమి లేదు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. F2 లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది వెంకీ టైమింగ్. సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం లో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించాడు. అనిల్ రావిపూడి కూడా F3 సినిమాని అదే లెవెల్ లో తీయనున్నట్టు తెలిపారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. F2 కి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ F3 కి కూడా సంగీతం అందించారునున్నారు. ఈ సినిమాని మరోసారి సంక్రాతి కానుకగా 2022 సంక్రాతి కి విడుదల చేయనున్నట్టు రూమర్స్ నడుస్తున్నాయి.