టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలిప్రేమతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ, ఆ సినిమాలోనే తన సున్నితమైన కథన శైలిని చూపించారు. అయితే మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, సార్ సినిమాతో మళ్లీ తన స్థానం బలపడేలా చేసుకున్నారు.
ధనుష్‌తో తెరకెక్కిన ఆ సినిమా రెండు భాషల్లో మంచి రెస్పాన్స్ పొందింది. ఆ తరువాత దుల్కర్ సల్మాన్‌తో చేసిన లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం వెంకీకి మరో మైలురాయిగా మారింది. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్య 46 ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక కోలీవుడ్ స్టార్ అజిత్‌తో వెంకీ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథను సిద్ధం చేసిన అనంతరం వినిపించనున్నారు. అలాగే చిరంజీవితో వెంకీ సినిమా చేసే చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.