స్టయిలిష్ కామెడీ మేకర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ, ఛలో సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘అఆ’ సినిమాలో అసిస్టెంట్‌గా పని చేసినప్పుడు త్రివిక్రమ్ గారి వర్క్ ఎథిక్ చూసి బోలెడు నేర్చుకున్నాన్నట్లు తెలిపాడు.
అప్పట్నుంచి ఆయన నా మెంటార్‌గా మారిపోయారు. ఆయన ఎదుట నేరుగా కథ చెప్పాలంటేనే భయం వేస్తుంది..అని వెంకీ వెల్లడించాడు.
ఆయన మాటల్లో కనిపించిన నిజాయితీకి అభిమానులు ఫిదా అయ్యారు. త్రివిక్రమ్ ఒక సీన్ గురించి చెప్పే ఒక్క మాటే బోలెడన్ని మార్పులకు దారితీస్తుందని చెబుతున్న వెంకీ, ‘‘ఆయన ముందు హోంవర్క్ చేయకుండా వెళ్లిన విద్యార్థిలా ఫీల్ అవుతాను’’ అన్నాడు.
ఇదే కారణంగా ఇప్పటివరకు తాను త్రివిక్రమ్‌కు ఏ స్క్రిప్ట్ కూడా చెప్పలేదని చెప్పాడు. ఇప్పుడు వెంకీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల, కేతిక శర్మ నటిస్తున్న “రాబిన్ హుడ్” హైప్ మీదుంది. తన మార్క్ మాస్ కామెడీకి తోడు, త్రివిక్రమ్ గురూజీకి మెచ్చేలా ఒక కథతో త్వరలోనే వెళ్ళాలని వెంకీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.