టాలీవుడ్: విజయభాస్కర్ డైరెక్షన్ త్రివిక్రమ్ రచనతో ‘స్వయం వరం’ అనే సినిమాతో హీరో గా పరిచయం అయిన నటుడు ‘వేణు తొట్టెంపూడి’. కెరీర్ ఆరంభం లో స్వయం వరం, చిరు నవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జుంక్షన్ లాంటి మంచి హిట్ సినిమాల్లో నటించి నటుడిగా కూడా మంచి గుర్తింపు సాధించాడు. తరువాత కొన్ని ఫ్లోప్స్ రావడంతో కనపడకుండా పోయాడు. మధ్యలో జూనియర్ ఎన్ఠీఆర్ నటించిన ‘దమ్ము’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. టాలెంట్ ఉన్నప్పటికీ ఈ నటుడికి ఎందుకో అవకాశాలు పలకరించలేదు. ప్రస్తుతం వేణు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యాడు అని తెలుస్తుంది.
రవి తేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో వేణు ఒక పాత్రలో నటించనున్నట్టు ఒక అప్ డేట్ విడుదల చేసింది సినిమా టీం. ఒక ఇంటెన్స్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో వేణు నటించడం సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. శరత్ మండవ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 90 ల నేపధ్యం లో రూపొందుతుంది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నటులందరూ మంచి పాత్రలతో విజయాలతో దోసుకెళ్తున్నారు. జగపతి బాబు, అరవింద స్వామి ఈ కోవలోకే వస్తారు. మంచి నటుడైన వేణు కూడా మంచి పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక వెలుగు వెలగాలని ఆశిద్దాం.