నీది నాది ఒకే కథ, విరాటపర్వం సినిమాలతో తనది ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. మనసులో రగిలే అఖండ కోటి ప్రశాలకు బయట దొరికే పొంతనలేని సమాధానాలకి మధ్య నలిగే ఒక హీరో పాత్ర ద్వారా, సహజం గా మనం రోజూ చూసే పాత్రలతోనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. తాను తీసే సినిమాలే కాదు తాను రాసే రచనలు కూడా చాలా లోతుగా ఉంటాయి. తాను రాసిన మరో పద్యం ‘???’ ఇటీవలే ఒక దిన పత్రికలో ప్రచురితం అయింది.
సినిమా కోసం అని పట్నాలకి వచ్చే కుర్రాళ్ళు వాళ్ళ కష్టాలు, వీళ్ళ కోసం ఊళ్ళల్లో వేచి చూసే వాళ్ళ తల్లి దండ్రులు వాళ్ళ పరిస్థితులను కళ్ళకి కట్టేలా రాసిన వేణు అడుగుల రచన చదివితే చాల రోజుల తర్వాత కొద్దీ నిముషాలు మెదడు పని చేయడం ఆపి గుండె పనిచేయడం మొదలు పెట్టింది. ఆ రచన తాలూకు లోతైన మాటలు , వారి కష్టాలు, వారి భావాలు విన్న వాళ్ళకే ఇలా వుంటే అది అనుభవించే వాళ్ళకి ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఉనికి కోసం పడే కష్టం, గెలుపు కోసం పడే కష్టం, చివరికి మిగిలిందేంటి – అనే మాటలతోఉన్న ఆయన రచన అమోఘం.
‘నిద్ర పోతున్న కూడా
ఒక కాలూపుతూనే ఉన్నాను
లేకపోతే చచ్చిపోయిన మనిషనుకొని
ఇక్కడ అవతలకి విసిరికొడతారు’
ఇలాంటి మాటలతో నిండిన ఈ రచన అద్భుతం అనడం కూడా చిన్న మాటే అవుతుంది. ఈ రచన చివర్లో ‘ఇక్కడ నేను నేను కాదు ఇప్పడు నా పేరు Ouroborus’. అంటే తనను తానే తినే పాము అని. ఈ రచనకి కూడా టైటిల్ ‘???’ అంటే నేను ఎవరో నా ఉనికి ఏంటో అనే ప్రశార్ధకం వచ్చేట్టు పెట్టారు అనిపిస్తుంది.