కోలీవుడ్: సౌత్ సినిమా లో టాలెంటెడ్ నటుల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉంటాడు నటుడు సూర్య. అవకాశం వచ్చినపుడల్లా తన నటన ఎంతలా ఉంటుందో నిరూపించుకుంటూ విలక్షణమైన సినిమాలు తీస్తూ అవకాశం దొరికినపుడు కథల ద్వారా, పాత్రల ద్వారా, వేషాల ద్వారా ప్రయోగాలు చేస్తూ కెరీర్ ని ముందుకి తీసుకెళ్లుతున్నాడు. తెలుగు లో తమిళ్ హీరోల్లో ప్రస్తుతం కొద్దో గొప్పో మంచి ఇమేజ్ ఉంది అంటే అది సూర్య కే. తెలుగులో సూర్య సినిమా రిలీజ్ ఐతుందంటే దాదాపు ఒక మీడియం రేంజ్ హీరో కి ఉన్నంత బజ్ ఉంటింది ఇక్కడ. ప్రస్తుతం సూర్య ‘సుధా కొంగర’ దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమాలో నటిస్తున్నాడు.కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినాకూడా విడుదలకి నోచుకోలేదు. ఈ రోజు సూర్య బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి ఒక పాట కూడా విడుదల చేసారు. అలాగే తాను తర్వాత తీయబోయే సినిమా అప్డేట్ కూడా సూర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు టీం.
తమిళ్ లో డైరెక్టర్ వెట్రిమారన్ క్రేజ్ ఏ వేరు. ఒక సినిమాని మాస్ గా చూపిస్తూ, కొత్తదనం జోడించి మూస లేకుండా తీసే డైరెక్టర్ వెట్రిమారన్. కొన్ని ప్రాంతాలలో ఉండే పరిస్థితుల ఆధారంగా కథ రాసుకొని ఉన్నది ఉన్నట్టు తియ్యడంలో ఈ డైరెక్టర్ దిట్ట. ఆ సమస్యలే వెట్రిమారన్ కథలకి మూలం. అలంటి కథలని తన కథనం తో ఎలా రక్తి కట్టించగలడో తాను తీసిన ‘ఆడుకులం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ సినిమాలే చెపుతున్నాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ సూర్య తో ‘వాడివసల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ఈరోజు సూర్య బర్త్డే సందర్భం గా విడుదల చేసారు. వెట్రిమారన్ ఇదివరటి సినిమాల్లాగే ఇది కూడా ఒక మామూలు కథని అందులో ఉండే సమస్యని గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు డైరెక్టర్.