fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsవేట్టయన్: కమర్షియల్ హిట్టే కానీ..

వేట్టయన్: కమర్షియల్ హిట్టే కానీ..

VETTAIYAN-IS-COMMERCIAL-HIT-BUT.png
VETTAIYAN-IS-COMMERCIAL-HIT-BUT.png

మూవీడెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన వేట్టయన్ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అమితాబ్ బచ్చన్, ఫాహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ నటులతో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా రిలీజ్ తర్వాత ఆ అంచనాలను అందుకుంది కానీ ‘జైలర్’ రేంజ్ లో మాత్రం లేదని టాక్.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

తమిళనాట ‘వేట్టయన్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది, కానీ తెలుగులో మాత్రం ఆ స్థాయి ఆదరణ రాకపోవడం విశేషం.

‘జైలర్’తో పోలిస్తే, “వేట్టయన్” అంత మాస్ ఎలివేషన్లతో కూడిన చిత్రం కాదు, ఇది ప్రధానంగా సోషల్ పాలిటికల్ పాయింట్ ను చర్చించే సినిమా.

డైరెక్టర్ జ్ఞానవేల్ రజినీకాంత్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిత్రాన్ని రూపొందించినప్పటికీ, ఈ పాయింట్ ప్రేక్షకులకి పూర్తిగా రీచ్ కాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

కథాంశం రొటీన్ గా లేకపోయినా, ప్రెజెంటేషన్ లో కొంత తడబాటు కనిపిస్తుందని, ముఖ్యంగా రెండవ భాగం స్లోగా సాగడం చిన్న మైనస్ గా మారిందని చెప్పుకోవచ్చు.

అయినా, సినిమాకి కొంత పాజిటివ్ టాక్ వస్తుండటంతో, రజినీకాంత్ ఫ్యాన్స్ మరియు మాస్ ప్రేక్షకులకి మాత్రం ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనర్ గా నిలిచిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular