టాలీవుడ్: మన దేశ ఉప రాష్ట్రపతి మన తెలుగు ప్రాంతం నుండి దేశ రాజకీయాల్లో వెలుగు వెలుగుతున్న వెంకయ్య నాయుడు. మామూలుగా ఇంత పెద్ద హోదా లో ఉన్న వాళ్లకి సినిమాలని చూడడం, వాటి గురించి మాట్లాడే సమయం అంతగా ఉండకపోవచ్చు. కానీ ఆయన ఒక తెలుగు సినిమా చూసి ఆ సినిమాలో ఉన్న గొప్ప అంశాల గురించి ఒక రెండు మాటలు ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.
ఈ మధ్యనే ఉమ్మడి వ్యవసాయం కాన్సెప్ట్ మీద శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాని వెంకయ్య నాయుడు గారు వీక్షించారు. ‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం’ అంటూ తన ట్వీట్ల ద్వారా ఈ సినిమాని సినిమా మేకర్స్ ని అభినందించాడు.
సినిమా విడుదలకి ముందు కూడా తెలంగా రాష్ట్ర మంత్రి వర్యులు కే.టీ.రామారావు గారు ఈ సినిమాలో చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రశంసించారు. సినిమా మంచి టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా కొంచెం వీక్ గా నడుస్తుంది. కలెక్షన్స్ ఎలా ఉన్న ఈ సినిమాకి మంచి టాక్ తో పాటు క్రిటిక్స్ ద్వారా కూడా మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటుతున్న మన సినిమాలు ఇలా నేషనల్ వైడ్ గా ఒక ఉప రాష్ట్రపతి ట్వీట్ ద్వారా మరింతగా గుర్తింపు పొందుతాయి.