టాలీవుడ్: ఈ మధ్య తెలుగులో రూపొందే సినిమాల్లో రీమేక్ ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీ టాప్ హీరో చిరంజీవి రెండు రీ-మేక్ సినిమాల్లో నటిస్తున్నాడు.కెరీర్ మొదటి నుండి వెంకీ చాలానే రీ-మేక్ సినిమాలు చేసాడు. వెంకీ ఈ మధ్య చేసిన సినిమాల్లో 60 శాతం వేరే బాషా నుండి అరువు తెచ్చుకున్న కథలే ఉంటాయి. ప్రస్తుతం కూడా తమిళ్ లో హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో నారప్ప అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితం మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాని తెలుగు లో రీమేక్ చేసి సూపర్ హిట్ సాధించాడు వెంకీ. ఐతే ఈ సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమా నిన్ననే అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈరోజు ఈ సినిమా ప్రొడక్షన్ మరియు డైరెక్షన్ టీం ఈ సినిమా తెలుగు వెర్షన్ వెంకీ తో తియ్యనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా మొదటి పార్ట్ కన్నా ఆసక్తి కరంగా సాగుతుండడం తో ఇప్పటికే చాలా మంది సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ ఓటీటీల్లో వీక్షిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ లో మొదలుపెట్టి F3 కన్నా ముందే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.