హైదరాబాద్: కరోనా వైరస్ వలన థియేటర్లు మూసివేయబడినందున చిత్ర నిర్మాతల కళ్లన్నీ ఇప్పుడు OTT పై ఉన్నాయి. పోంమగళ్ వంధల్ అనే తమిళ చిత్రం తో ప్రారంభమై ఇప్పుడు చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం రెండు పెద్ద సినిమాలు OTT లో విడుదల కానున్నాయి అని మరియు తేదీలు నిర్ధారించబడ్డాయి.
అదితి రావు హైదరి మరియు జయ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం సుఫియం సుజాతయం జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని నరణిపుళ షానవాస్ రచన మరియు దర్శకత్వం వహించారు మరియు విజయ్ బాబు తన బ్యానర్ ఫ్రైడే ఫిల్మ్ హౌస్ లో నిర్మించారు.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో విడులకబోయే మరో చిత్రం శకుంతల దేవి. ఈ బాలీవుడ్ చిత్రంలో విద్యాబాలన్ హీరోయిన్ గా నటించింది. ఈ బయోపిక్‌లో ఆమె గణిత పండితరాలు శకుంతల దేవి గా నటించనుంది. ఈ చిత్రం జూలై 31 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. థియేటర్లు తిరిగి తెరవబడతాయని ఎదురుచూస్తున్న వారందరూ విరామం తీసుకొని ఈ సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు. ఎందుకంటే థియేటర్లు నిస్సందేహంగా మరికొన్ని నెలలు మూసివేయబడతాయి. రెండు తెలుగు చిత్రాలు కూడా త్వరలో OTT లలో విడుదల కానున్నాయి.